
ఉలుపాల శేఖర్ రెడ్డి … తీదేడు గ్రామ మాజీ ఉప సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు
Two Drops : చింతపల్లి జూన్ 28, త్రినేత్రం న్యూస్. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు సురక్షితమని తీదేడు గ్రామ మాజీ ఉపసర్పంచ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని పల్లె ధావఖాన వద్ద నిర్వహించిన పల్స్ పొలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…0-5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు భరోసా అని ఆయన పేర్కొన్నారు.పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యతని 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడు కుందామని ఆయన తెలిపారు.ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్,బిఆర్ఎస్ నాయకులు రాశిక శీరీష్,ఏం.యన్.యం లు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe