తేదీ : 02/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కరి వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి , జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరన్ రాజ్, చింతలపూడి శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ ఆర్జీ పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో తక్షణమే పరిష్కారం చేయాలని సూచించారు.
వెంటనే వారు స్పందిస్తూ పరిష్కార మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దీంతో ప్రజలందరూ ప్రభుత్వ అధికారులకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎవరికి ఎటువంటి లోటు పాట్లు, లేకుండా, రాకుండా మంచినీరు, భోజన సదుపాయాన్ని సంబంధిత అధికారులకు కల్పించారు. మండల తహసీల్దారు, కూటమి నాయకులు , ప్రజల పాల్గొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ను విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


