MLA Nenavath Balu Naik : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 02 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి, తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన సోనియాగాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు.

ఈ 16 నెలల పాలనలో రైతుల సంక్షేమానికి 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సుమారు 21 వేలకోట్లపైగా రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు ₹500 బోనస్ ఇచ్చి రైతున్నకు అండగా నిలిచామని తెలిపారు. 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఓ వైపు ఉద్యోగాల భర్తీ, మరోవైపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేస్తూ యువత కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మహిళా సంఘాలకు రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, స్వయం ఉపాధి శిక్షణ, అవకాశాల కల్పన ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు వేయిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలకు పునాదులు వేశామని గుర్తు చేశారు. సన్నబియ్యం పంపిణీ చేసి,దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లతో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఆరోగ్య, విద్యా సంస్థల బలోపేతం ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ, అన్ని రంగాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణ ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు,మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top