Public Movements : అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు

TRINETHRAM NEWS
Public movements cannot be halted by arrests

ఎన్నికల ముందు నమ్మించి, తీరా గద్దెనెక్కాక నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బి
వయోపరిమితి 46 నుంచి 34కి తగ్గించి, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న రేవంత్ సర్కార్
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

Public Movements : దేవరకొండ డివిజన్ మార్చ్ 30, త్రినేత్రం న్యూస్. అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణఅన్నారు. సోమవారం నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… నిరుద్యోగులను ఎన్నికల ముందు నమ్మించి, తీరా గద్దెనెక్కాక నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.

వయోపరిమితి 46 నుంచి 34కి తగ్గించి, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న రేవంత్ సర్కార్ అని ఆయన అన్నారు.తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ఆయన అడిగారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ లేదు, రూ. 4,000 నిరుద్యోగ భృతి ఏమైంది అని ఆయన అన్నారు.బడ్జెట్‌లో ‘జాబ్ క్యాలెండర్’ ఊసే లేదు అని ఆయన తెలిపారు.
​బడ్జెట్ లో 2 లక్షల ఉద్యోగాల ప్రస్తావన లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు.ప్రజలకు ఇచ్చిన 6గ్యారంటీలు హామీ లను కచ్చితంగా అమలు చేయాలి, చేయకుంటే ప్రజల పక్షాన ఉద్యమాలను ఉదృతం చేస్తామని అని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top