సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
SFI

SFI : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 22, త్రినేత్రం న్యూస్. ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి డి టి. కి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకుండా విద్య ఏ విధంగా ముందుకు సాగుతుందని అన్నారు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు రెండు జతల యూనిఫామ్స్ ఇయ్యలేదని అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ రాలేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్య రంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని,.విద్య సంస్థలు ప్రారంభం కాక ముందే దేవరకొండ డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ అమ్ముతున్న కూడా విద్యాశాఖ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదనీ మండి పడ్డారు..

ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన ఉందా లేదా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పక్షాన ఉందా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేవన్నారు త్రాగునీరు టాయిలెట్స్ మరుగుదొడ్లు స్పోర్ట్స్ కిట్స్ కంప్యూటర్స్ ల్యాబ్స్ గ్రౌండ్స్ తరగతుల గదులలో ఫ్యాన్స్ లైట్స్ సరైన టీచర్స్ లేకపోవడం ఇంకా ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ స్కూల్ బెల్ట్ స్కూల్ బ్యాగ్స్ త్వరగా అందించలన్నారు అలాగే వారి యొక్క మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు లేదంటే నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తామని సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుంటి గుర్ల నాగరాజు ,పులిజాల శివ పర్వతం మణికంఠ, మన్విత్, మౌనిక, అశ్విని, అనూష,అఖిల, అనురాధ, గీతాంజలి యశ్విత, సీత, శివానే,నాగశ్రీ, కీర్తన అంజలి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page