జూలై 28, 2026
TRINETHRAM NEWS
Budiga Venkatesh

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ డిమాండ్…

Budiga Venkatesh : దేవరకొండ డివిజన్ జులై 27, త్రినేత్రం న్యూస్. ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొండమల్లెపల్లి లో సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగాఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ…. పాఠశాలలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి,విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా,మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

సర్వేలో తరగతి గదుల కొరత,తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ,ఫర్నిచర్ కొరత,ఉపాధ్యాయుల సమస్యలు తదితర అంశాలను గుర్తించినట్లు అన్నారు..సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి,దేవరకొండ ఆర్డీవో పద్మప్రియ కి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు..
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మండల అధ్యక్షుడు రామావత్ రాజేష్, నాగరాజు,ఏ. సుధాకర్, అంకురి ప్రణయ్, దుళ్ల కార్తీక్, నీతిన్, బత్తుల శివ, నేతళ్ళ జైరాం తదితరులు పాల్గొన్నారు.._

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page