Public Complaints : ప్రజా ఫిర్యాదు లను సత్వరమే పరిష్కరించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ భూ సమస్య లు, పెన్షన్ లకు సంబందించి ఫిర్యాదు లు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
సి ఎం ఓ ప్రజావాణి కి జిల్లా పై వచ్చిన ప్రజా ఫిర్యాదు లను చెక్ చేసి దరఖాస్తు ఎ ప్రాసెస్ లో ఉందొ చెక్ చేసి ఆన్లైన్ అప్డేట్ చేయాలనీ ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public complaints should be

You cannot copy content of this page

Scroll to Top