Jobs in D-Mart : డి మార్ట్ లో ప్రైవేట్ జాబ్స్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ హైరింగ్ డి-మార్ట్ కోసం హైదరాబాద్ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటన తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ వికారాబాదు నందు జులై 09 బుధవారం ఉదయము 10:30 గంటలకు జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డి-మార్ట్ నందు సుమారు 200 క్యాషియర్, సేల్స్ అసోసియేట్స్ పోస్టులు ఉన్నాయని వీటికి కనీస వయస్సు 18 నుంచి 24 సంవత్సరం లోపు నిరుద్యోగ యువతీ యువకులు అందరూ అర్హులని ఆయన తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి పదవ తరగతి అంతకంటే ఎక్కువ పాస్ లేదా ఫెయిల్, విద్యా అర్హత కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఇట్టి ఉద్యోగాలు హైదరాబాద్ లో ఉన్నాయని ఈ జాబ్ మేళ ద్వారా ఎంపిక అయినా వారికీ నేరుగా ఉద్యోగం కల్పించబడును అని ఆయన అన్నారు ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. Shaik Abdus Subhan జిల్లా ఉపాధి కల్పనా అధికారి జిల్లా ఉపాధి కల్పనా కేంద్రము వికారాబాదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Private Jobs in D-Mart

You cannot copy content of this page

Scroll to Top