త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గఇంచార్జ్ : అల్లూరిజిల్లా, రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9 వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు ” సిపిఐ పార్టి “పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. అల్లూరి జిల్లా సిపిఐ పార్టి కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కార్మికుల మద్దతు సంపూర్ణముగా తెలియజేస్తున్నామని, ఓ ప్రకటనలో తెలియజేశారు. మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇరువాడ దేవుడు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇటీవల కాలంలో కేంద్రములో బిజెపి ప్రభుత్వము నాలుగు లేబర్ కోడులను తీసుకుని వచ్చి కార్మికుల పట్ల చాలా నిరంకుశముగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఈ దేశ సంపాదన బడా కార్పొరేట్ వ్యక్తులకు దానదత్వము చేస్తున్నారని ఆరోపించారు. అలాగునే 9న జరిగే సమ్మెను రైతులు, కార్మిక సంఘాలు పాల్గొనాలని దేవుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టి జిల్లా కార్యదర్శి పొట్టికి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇరువాడ దేవుడు, గిరిజన సమైక్య అధ్యక్షుడు దర్శి సతీషు, ఇరువాడ రాజు, సిపిఐ మండల కార్యదర్శి మాజీ కంకిపార్టీ సత్తిబాబు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


