Collector Prateek Jain : పాత హాస్పిటల్ లో మరమత్తులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి లో మరమ్మతుపనులను త్వరితగతిన పూర్తి చేయాలనిజిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని పాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో ఉన్న వార్డ్స్ ను , వాష్ రూమ్ లు అన్నింటిని పరిశీలించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆసుపత్రి అవసరమైన విభాగాలను అన్నింటిని ఏర్పాటు చేసుకొని ప్రజలకు వైద్య సేవలను అందించే విధంగా ఆసుపత్రిని తీర్చిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారుల కు సూచించారు. ఆసుపత్రి బిల్డింగ్ కు వేస్తున్న పెయింటింగ్ ను పూర్తి చేసి ఆసుపత్రిలో మైనర్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకు రావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పిఆర్ఇఇ ఉమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Repairs at the old hospital

You cannot copy content of this page

Scroll to Top