వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల కు బడి బాట ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని వికారాబాద్ జిల్లా BC,SC,ST-JAC ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
తెలంగాణలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాల పిల్లలు చదువుతున్నారు. వారికి సరైన విద్య అందాలంటే ప్రతి స్కూలుకు 5 బస్సులు పెట్టి వారిని స్కూలుకు తీసుకువెళ్లి బడి ముగిసిన తర్వాత ఇంటిదగ్గర వదిలిపెట్టాలి మరియు మౌలిక వసతులు కల్పించాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలకు రావడానికి సుమకత వహిస్తారు. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెమోరండం ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు రవిందర్, నర్సింలు, శేఖర్, సత్యం, రాజు, రమేష్, నవీన్ రాథోడ్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


