విద్యా వ్యవస్థలో అవినీతి పర్వం – దేవరకొండ నియోజకవర్గం పాఠశాలల్లో విచారణ జరిపించాలి

TRINETHRAM NEWS
-బాధ్యతలు సక్రమంగా నెరవేర్చని ఉపాధ్యాయులు – మౌనంగా ఉన్న విద్యా శాఖ అధికారులు!...

గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ & విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్.
దేవరకొండ జూలై 08 త్రినేత్రం న్యూస్.. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్న దృశ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండగా, వాస్తవానికి విరుద్ధంగా పెద్ద సంఖ్యలో హాజరు నమోదు చేయడం, మధ్యాహ్న భోజనం, బిల్లు ఖర్చులు, నిధుల వినియోగం వంటి అంశాలలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి.

ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరుకాకపోవడం, విద్య బోధనలో నిర్లక్ష్యం వహించడం, పాఠశాల వాతావరణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం వంటి ఘటనలు జిల్లాలో అనేక చోట్ల వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా విద్యా శాఖ అధికారులు అయిన డీఈఓ, ఎంఈఓలు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

పాఠశాలలు విద్యా గదులుగా కాకుండా, నిధుల దుర్వినియోగ కేంద్రాలుగా మారుతున్నాయి.
బడిపంతులు విధులు విస్మరిస్తూ, స్కూల్‌లో అసలు బోధనే జరగని పరిస్థితి నెలకొంది.
తల్లిదండ్రులు, స్థానికులు చేసే ఫిర్యాదులు అధికారుల టేబుళ్లపై పడి నిశ్చలంగా మిగులుతున్నాయి.

ఈ పరిస్థితులపై నేను గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నానుఅని అన్నారు. బడిపంతుల నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను చిద్రముచేస్తోంది. ప్రభుత్వం విద్యపై ఖర్చు చేస్తున్న నిధులు అవినీతికి గురవుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కోల్పోతున్నారు. ఇది వ్యవస్థా వైఫల్యం – తక్షణ చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తే పతనమవుతుంది. ఆయన అన్నారు .

మా ముఖ్య డిమాండ్లు .

దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు జరపాలి.
స్కూల్ హాజరు పట్టికలు, విద్యార్థుల లెక్కలు, బిల్లు ఖర్చులపై ప్రత్యేక ఆడిట్ చేయాలి.
హాజరు లేకుండా జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఎంఈఓ, డీఈఓ స్థాయి అధికారులపై విపుల విచారణ జరిపించాలి.
గ్రామీణ పాఠశాలల్లో విద్యా హక్కులను రక్షించేందుకు పబ్లిక్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.

ఇది మౌనంగా చూసే పరిస్థితి కాదు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రజలందరిదీ. గిరిజన సంక్షేమ సంఘం & విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేం ఈ సమస్యపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. విద్యను వ్యాపారంగా మార్చిన వారిని బహిరంగంగా ఎదుర్కొంటాం అని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corruption in the education

You cannot copy content of this page

Scroll to Top