జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 13 at 18.00.24

TRINETHRAM NEWS

ఏపీ, తెలంగాణ ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇంట్లో సోమవారం సాయంత్రం చోరీ జరిగింది.

ఇంట్లో బీరువా తెరిచి చూసి కలెక్టర్ అరుణ్ బాబు షాక్ అయ్యారు ఎందుకంటే 10 రోజుల క్రితం మూడు బంగారు ఆభరణాలను బీరువాలో పెట్టారట పది రోజులు తర్వాత బీరువా తెరిచి చూసేసరికి ఆభరణాలు మిస్ అయినట్లు ఈరోజు కలెక్టర్ అరుణ్ బాబు గుర్తించారు.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ బంగ్లాకు వచ్చిన పోలీసులు ఇంట్లో పనివాళ్లను విచారించారు. కలెక్టర్ బంగ్లాలో ఆభరణాల మిస్సింగ్ ఖచ్చితంగా ఇంటి దొంగల పనై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ అరుణ్ బాబు బంగ్లాలో లేని సమయంలో చోరీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీ సులు. ఎంత విలువైన బంగారు ఆభరణాలు చోరీకీ గురయ్యాయో తెలియాల్సి ఉంది.

ఇటువంటి సంఘటనలు తెలంగాణలో కూడా జరిగినట్లు సమాచారం ఈ చోరీ ఘటనపై ఇప్పటి వరకు కలెక్టర్ అరుణ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ చోరీ ఘటనపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని విచారిస్తామన్నారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.

You cannot copy content of this page