త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 18. మండపేట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరంచేస్తుందని మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మెన్ తోట త్రిమూర్తులు, విమర్శించారు. నిరుపేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు ఎంబీబీఎస్ చదువుల అవకాశం కల్పించిన ఘనత జగన్, కు దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ కళాశాలలను తమ తాబేదారులకు, పార్టీ పెట్టుబడిదారులకు 60 సంవత్సరాల లీజు పేరుతో కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు తోట త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు.
త్రిమూర్తులు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు వైద్య విద్యను అందుబాటులో,కి తెచ్చారన్నారు. ఇంజనీరింగ్ విద్యలా ప్రతి కుటుంబంలో ఒకరు ఇంజనీర్‌గా ఉద్యోగం సాధిస్తున్నట్లే, కనీసం ఒక గ్రామంలో ఐదుగురు వైద్య విద్యను అభ్యసించేలా జగన్ అవకాశం, కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం,ఈ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ నిరుపేదల ఆశలను, గండికొడుతోందనీ దుయ్యబట్టారు. ఇది దారుణమైన చర్యని విమర్శించారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని కోటి మంది ప్రజల నుండి వినతి, పత్రాలు సేకరించి గవర్నర్‌కు అందజేయనున్నట్లు త్రిమూర్తులు తెలిపారు. అందులో భాగంగా, మండపేట పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయం నుంచి రాజారత్న సెంటర్ వరకు ప్రజలకు, జరుగుతున్న విషయాలను వివరిస్తూ సంతకాల సేకరణ ర్యాలీ ద్వారా చేశారు. కూటమి ప్రభుత్వం మోద్దు నిద్రలో ఉందన్నారు. నిరుపేదలకు అందాల్సిన వైద్య విద్యను కార్పొరేట్‌లకు అప్పగించడం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పట్టణ మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, జడ్పీటీసీ పుట్టపూడి వీర వెంకట సత్యనారాయణ (అబ్బు), ఎంపీపీలు నౌడు వెంకటరమణ, శాకా శ్రీనివాస్, వైసిపి కన్వీనర్లు అడబాల బాబ్జి, గూటం సత్యనారాయణ, పిల్లి శ్రీనివాస్, వెలగల సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగబాబు, పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారయ్య బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, వివిధ విభాగాల సభ్యులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


