మద్యం ప్రియులపై ఫైన్ రూపంలో కుటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తుంది….
రాత్రి 10 దాటాక డ్రంక్ &డ్రైవ్ నిర్వహించాలి…
రేపు రాబోయే ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 19. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట గొల్లపుంత కాలనీ, ఏడిది రోడ్డు, టిడ్కోగృహాలు, కొండపల్లి వారి వీధి లో గడపగడపకి ఇంట్లో, కిల్లి షాపుల్లో బెల్ట్ షాపు వ్యాపారం చేస్తున్న నిద్రిస్తున్న పోలీసులు… 8 వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి మండపేట నియోజకవర్గం ఆర్ టి ఐ యాక్ట్ విభాగ అధ్యక్షులు మందపల్లి రవికుమార్ డిమాండ్.
మద్యం షాపులవద్ద పోలీసులు మద్యం ప్రియులకు ఫైన్ లు వేస్తూ మద్యం తాగే వాళ్లకి బ్రాందీ షాపులు వద్ద భారీ జరిమానాలు వెయ్యడంపై మద్యం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి మద్యం ప్రియులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బ్రాందీ షాపులు వద్ద పోలీసు అధికారులు రిక్కీ నిర్వహించి మద్యం సేవించిన వారిపై 12 వేలు రూపాయలు అధిక ఫైన్ లు వేస్తున్నారని మద్యం ప్రియులు కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించే వారు బ్రాందీ షాపు వద్ద మద్యం సేవిస్తుండగా పోలీసులు చుట్టుపక్కల రిక్కీ నిర్వహించి మందుబాబులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని మద్యం సేవించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపుంత కాలనీ, ఏడిది రోడ్డు,టిడ్కోగృహాలు, కొండపల్లి వారి వీధి, వద్ద, మండపేటలో ప్రతి ఇంట్లో, కిల్లి షాపుల్లో బెల్ట్ షాపులు రన్ చేస్తూ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోగా మద్యం షాపులు వద్ద మద్యం సేవించే వారిపై రాత్రి సమయంలో పోలీసులు రాత్రిపూట 10 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం బ్రాందీ షాపులు వద్ద ఏడు గంటల నుండి మద్యం సేవించే వారిపై తీవ్రమైన భారం వేస్తున్నారని వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, వారి వాహనాలు, పోలీసులు హ్యాండ్వార్ చేసుకుని వారిని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి వారిపై అధిక భారం ఫైన్ లు 11,500 రూపాయలు ఫైన్లు ప్రజలుపై రుద్దుతున్నారని కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తివేత్తం ప్రజలు చేస్తున్నారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామాల వారిగా మున్సిపాలిటీ ఊరి చివర బైపాస్ రోడ్డులో మద్యం షాపులు ఏర్పాటు చేసి ఒక టైం ప్రకారం రాత్రిపూట 10 గంటలు దాటేగా పోలీసులు రిక్కీ నిర్వహించి వారిపై కేసులు నమోదు చేసేవారని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఊరి నడిబొడ్డులో మద్యం షాపులు నిర్వహించి వారి వద్ద నుండి ఫైన్ రూపంలో కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తుందని మద్యం ప్రియులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంటికిపట్టుకెళ్లి తాగితే భార్యపిల్లలతో ఇబ్బందులు బయటతాగితే డ్రంక్ డ్రైవ్ కేసులు తాగి పట్టుబడితే కోర్టులో జైలు, ఫెనాల్టీ లు వెస్తున్నారని మద్యానికి అలవాటుపడ్డా సామాన్యుడు పరిస్దితి ఏంటి అని మందు రోజూ తాగేవారు ఎక్కడతాగాలి
రాత్రి 10 దాటాక డ్రంక్ డ్రైవ్ నిర్వహించాలని ప్రజలు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. కుటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మద్యం ప్రియులు బ్రాందీ షాపులు వద్ద మద్యం సేవించి ఇంటికి వెళుతుంటే పోలీసులు బ్రాందీ షాపులు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ప్రజలను తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ప్రియులు ఉదయం నుండి తమ వృత్తులు చేసుకుంటూ రాత్రిపూట మద్యం సేవిస్తుంటే పోలీసులు బ్రాందీ షాపులు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిర్వహించి అధిక వసూలు చేస్తున్నారని మద్యం సేవించిన వారిని ఫైన్ రూపంలో 12 వేల రూపాయలు జరిమాణం వేస్తున్నారని 8 వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కుటమి ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి కనీసం డిపాజిట్లు కూడా లేకుండా కూటమి ప్రభుత్వం భూస్థాపితం కి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చెందుతున్న ప్రజలే తగిన బుద్ధి చెప్తారని 8 వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి మండపేట నియోజకవర్గం ఆర్ టి ఐ యాక్ట్ విభాగ అధ్యక్షులు మందపల్లి రవికుమార్ హెచ్చరించారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


