
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్
Private Corporate Fee : దేవరకొండ డివిజన్ జూన్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) దేవరకొండ డివిజన్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ హాజరై మాట్లాడారు. ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ,విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంచేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో బుక్స్,యూనిఫాం పేరుతో వేలకు వేలు దండుకున్నారని అన్నారు.
ఈ పాఠశాలల మీద విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నారని పాఠ్యపుస్తకాలు,ఫీజులు కట్టని విద్యార్థులను తరగతులకు అనుమతించకుండా వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. అదేవిధంగా ఖమ్మం శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు,తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపడం దారుణమని,ఇటువంటి విద్యా దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు.కానీ నేడు కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ, ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించడంతో పాటు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చి, విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, మల్లేష్, ఏ.త్రిశాంత్, ఆర్.అశోక్,ఎన్.అరవింద్, ఎన్.అఖిల్,వి. గణేష్,జైరాం, మనోహర,, శ్రవణ్,ఆంజనేయులు,యశ్వంత్, శోభన్,తదితరులు పాల్గొన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe