Primary Agriculture ప్రాథమిక వ్యవసాయం, విద్యా బోధన, ఆధార్ సెంటర్ మంజూరు

TRINETHRAM NEWS

తేదీ : 09/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం , దర్భ గూడెం, ములగలంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అక్కి శెట్టి. విజయ ప్రసాద్, అదేవిధంగా ములగలంపల్లి సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి. రాఘవయ్య , కార్యదర్శి పి. నాగ వెంకట మధుసూదన్ రావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సకాలంలోనే మా సొసైటీ కి సంబంధించినటువంటి రైతులందరికీ లోన్ లు , వాళ్లు ఏ పంట లు అయితే పండిస్తున్నారో ఆ పంటలకు సంబంధించి ఎటువంటి కొరత లేకుండా ఎరువులు, యూరియా లాంటి వాటిని అందించమని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కామయ్యపాలెం ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సుబ్బరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వ సమయం పాలన ప్రకారం పాఠశాల తెలుస్తున్నామని, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద విద్యార్థులకు సన్న బియ్యం తో కూడిన అన్నము, కూరగాయలు ఆకుకూరలు గుడ్లు మొదలైనవి శక్తినిచ్చే పౌష్టిక ఆహారం అందిస్తున్నామని అన్నారు.
రోజు విడిచి రోజు రాగిజావ, వేరుశెనగ గింజలు మరియు బెల్లం తో తయారు చేసినటువంటి చిక్కీలు అందిస్తున్నామని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ప్రతి ఒక్క విద్యార్థికి అందించామని తెలిపారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారో సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం రూపాయలు పదిహేనువేలు విద్యార్థుల తల్లుల సంబంధితబ్యాంకు ఖాతాలో పడ్డాయని చెప్పడం జరిగింది.ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులను బాధ్యతగా చూసుకుంటున్నామని చెప్పారు. టీ నర్సాపురం మండలం , వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం గ్రామంలో నూతన ఆధార్ సెంటర్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ -ఆధార్ సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కుల ,మత, పార్టీ భాష భేదము లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అందాయని, తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, ఎన్నికలకు ప్రజలందరూ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Primary Agriculture, Education, Aadhaar Center Grant

You cannot copy content of this page

Scroll to Top