CM Revanth : శాంతి దూతగా చెర‌గ‌ని ముద్ర వేసిన పోప్ ఫ్రాన్సిస్‌

TRINETHRAM NEWS

టోక్యో: శాంతి దూత‌గా ప్ర‌పంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెర‌గ‌ని ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథ‌లిక్ చ‌ర్చి అధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ మ‌ర‌ణంపై ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ త‌న జీవితాన్ని చ‌ర్చి, మాన‌వ సేవ‌కు అంకితం చేశార‌ని, శ‌ర‌ణార్ధుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. సామాజిక న్యాయం, మత సామరస్యం పెంపున‌కు ఆయ‌న అవిశ్రాంతంగా శ్ర‌మించార‌ని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటు అని సీఎం తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేథ‌లిక్ స‌మాజానికి ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి సానుభూతిని తెలియ‌జేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pope Francis left an

You cannot copy content of this page

Scroll to Top