మాజీ హోంగార్డ్ సుధాకర్ కు నీడ ఆరోగ్యం మస్తు పెన్షన్ 521 రూపాయలు అందించిన గోవర్ధన్
Trinethram News : గోదావరిఖని మే-22//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : గంగానగర్ కు చెందిన దాత ముక్కెర గోవర్ధన్ యాదవ్ జన్మదినo సందర్భంగా నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ పథకం ద్వారా నిరుపేద డయాలసిస్ పేషెంట్ సుధాకర్ కి 521 రూపాయలు పెన్షన్ అందజేశారు. మార్చి వరకు ప్రతినెల 521 నీడ సంస్థ అందిస్తుందని నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ తెలిపారు.
సుధాకర్ గత సంవత్సర కాలంగా డయాలసిస్ తో బాధపడుతున్నాడని గత మూడు నెలల క్రితం భార్య కూడా చనిపోయింది దీంతో కూతురే అన్నితానై తనకు సేవలు చేస్తుంది.వీరి ఆర్థిక విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గోవర్ధన్ సహకారంతో పెన్షన్ కార్డు అందచేశారు. ఇక ముందు కూడా వీరి కుటుంబానికి ఆసరాగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, దాత ముక్కెర గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


