Vyalla Harish Reddy : నిరుపేద యువతి వివాహానికి వ్యాల్ల హరీష్ రెడ్డి పౌండేషన్ చేయూత

TRINETHRAM NEWS

రామగుండం మే-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో తల్లితండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహాన్ని నానామ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి ఆదేశాలతో, బిఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండి జాహిద్ పాష ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ ఎన్ వి రమణారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గం లోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ విహెచ్ ఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా వ్యాళ్ళ హరీష్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అందరికి అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ.. వారికి పేద ప్రజల పక్షాన నిలిచేందుకు భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా హరీష్ రెడ్డికి యువతి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సున్నిబరేలివి ఆర్గనైజేషన్ అధ్యక్షులు అఫ్జల్ రజ్వి అడ్వకేట్, షానవాజ్ రాజా, బూరుగు వంశీకృష్ణ, రోడ్డ సంపత్, గుండవేని సంతోష్ యాదవ్, సువర్ణ నాగేశ్వరరావు రాణి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vyalla Harish Reddy lays

You cannot copy content of this page

Scroll to Top