Government Hospitals : ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు

TRINETHRAM NEWS

కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరు
దాతలిచ్చిన ఐస్ కేస్ లు , వెంటిలేటర్లు సైతం వాడడం లేదు
సీరియస్ కేసులను కాకినాడ పంపే లోపే ప్రాణాలు పోతున్నాయి
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సౌకర్యాలు కల్పించాలి
తగిన సిబ్బంది నియామకంలో శ్రద్ధ వహించాలి
ప్రభుత్వాసుపత్రి సందర్శనలో మాజీ ఎంపీ భరత్

Trinethram News : రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేసారు. చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలనుంచి నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి, ఆయా వార్డుల్లో పరిస్థితులను పరిశీలించారు. పలు సమస్యలను గుర్తించారు. సిబ్బందిని కూడా పలు విషయాలపై ప్రశ్నించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవన్న విషయాన్ని స్పష్టంగా గమనించామని అన్నారు. అందుకే ఇక్కడకు వచ్చిన కేసులలో 60 శాతం విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే, సీరియస్ గా ఉందని, కాకినాడ తరలిస్తున్నారని ,అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పుతున్న సందర్భాలున్నాయని ఆయన ఆవేదన చెందారు. గర్భవతులు చేరితే, వాళ్ళను లేబర్ రూమ్ కి కూడా తీసుకెళ్లడం లేదని, ఫలితంగా బెడ్ మీదే ప్రసవం అయిపోతున్నాయని , నిన్న రాత్రి కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన చెందారు. మార్చురీలో కూడా దాతలు ఇచ్చిన ఐస్ కేసులున్నా సరే, అక్కడున్న రెండో మూడో తప్ప మిగిలినవి వాడడం లేదని, అలాగే వెంటిలేటర్లు కూడా దాతలు ఇచ్చినవి ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే వాడుతున్నారని భరత్ వాపోయారు.
రోడ్డుపై పడిన ఒక ముసాయన పడివుంటే, ఒక బాధ్యత గల పౌరుడు ఆసుపత్రికి తీసుకెళ్తే, అక్కడ విద్యుత్ సరఫరా లేదని, అదంతా వీడియో తీసి పంపిస్తే, ఆ వీడియోలో పరిశీలిస్తే, మరో ఇరవై మంది పరిస్థితి కూడా మరింత దుర్భరంగా ఉందని భరత్ అన్నారు. మేము వస్తున్నామని తెల్సి వార్డుల్లో శుభ్రం చేయడం, కరెంట్ పునరుద్ధరించడం చేసారని ఆయన అన్నారు. అక్కడ బతికేవాళ్లు మనుషులా కాదా అని భరత్ ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటోందని భరత్ నిలదీశారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏమిటి, ఇంకా ఏమి కల్పించాలి, దానికి తగ్గ డాక్టర్లు ఉన్నారా లేదా, తగినంత స్టాఫ్ ఉన్నారా లేదా అనే విషయాలు కూడా రివ్యూ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమని భరత్ అన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులపై , సమస్యలపై వీడియోలు చేసేది రాజకీయ ప్రయోజనాల కాదని, పేషంట్ల కు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికేనని ఆయన స్పష్టంచేసారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కరోనా సమయంలో పడిన ఇబ్బందులు గమనించి ఆసుపత్రిలో పరిస్థితులు మెరుగు పరచడం కోసం చర్యల్లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని భరత్ పేర్కొన్నారు. దాన్నుంచి తరువాత స్టెప్ వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది లేదా అని ఆయన ప్రశ్నించారు.
వీడియో తీసిన వీరా అనే యువకుడు మాట్లాడుతూ ఒక ముసలాయన రోడ్డుమీద పడివుంటే, ఆటోలో తీసుకొచ్చి చేర్చమని, స్రేచర్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే రూమ్ కి తీసుకెళ్లారని, అయితే అక్కడ కూడా విద్యుత్ లేదని చెప్పాడు. 500పడకల ఆసుపత్రి అయినందున ఇక్కడ 24గంటలూ కరెంట్ ఉండాలని, కనీసం జనరేటర్ కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Poor conditions in government hospitals

You cannot copy content of this page

Scroll to Top