Police Martyrs’ Day : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు పోలీస్ అమరవీరులకు అధ్యక్షుడు ఎన్ వీ టీ సభ్యులతో కలిసి అమరుల పటానికి పూలమాలవేసి నివాళులర్పించినారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటారని, భారత చైనా సరిహద్దులోని అక్షయ్ చిన్ ప్రాంతంలో 16 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచి పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతికగా మన మధ్య నిలిచి ఉందని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామనీ తెలిపారు.

1959 అక్టోబర్ 21న డిఎస్పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలాలు సియాచేన్ భూభాగ ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పి దళం ఆట స్ప్రింగ్ ప్రాంతంతో దీటుగా ఎదురోడ్డు పోరాడింది ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తించుకొని నివాళులు అర్పించాలని అన్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు మీనాక్షి చౌరస్తా నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు పోలీస్ అమరవీరుల కు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, రాపోలు నిరంజన్, బత్తుల అమర్, భాస్కర్ రెడ్డి, ఆర్మీ శ్రీనయ్య ,శేఖర్, కరాటే మాస్టర్స్ గోపి, చైతన్య, జమీర్, మధు, విజయ్, సంతోష్,సాత్విక్, గౌతం, అతి రామ్, భగవాన్, రాము విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police Martyrs' Reform Day

You cannot copy content of this page

Scroll to Top