త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య… అంకంపాలెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడే వెంకటరావు స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి, ఆరోగ్య సమాచారం గురించి వెంకటరావు నీ అడిగి తెలుసుకొని, ఆత్మీయంగా కుటుంబ సభ్యులను పలకరించి, నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అభయమిస్తూ,
ధైర్యంగా ఉండాలని బరోసా కల్పించి,త్వరగానే ఆరోగ్యంతో కోలుకుంటావని,ఏ అవసరత ఉన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియచేస్తూ, తక్షణ సహాయం కింద ఐదువేల రూపాయలు వారి చేతుల మీదుగా వాడే వెంకటరావుకి వైద్య ఖర్చుల నిమిత్తం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పెనుబల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు కాక ప్రసాద్,కోండ్రు ప్రసాద్, సోయం ముత్యాలరావు, మోకాళ్ళ గురుమూర్తి, తాటి రాము, కోండ్రు శ్రావణ్, మడకం గంగరాజు,కూరం జయంత్, కోండ్రు సాయి, సోయం వేంకటేశ్వరరావు, కూరం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


