Collector P Prashanthi : జూన్ 30 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్

TRINETHRAM NEWS

డబల్ వన్ డబల్ జీరో” కి ఫోన్ చేసి పిజిఆర్ఎస్ పరిష్కార స్థాయి తెలుసుకోండి

వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  ద్వారా ప్రజలకి పౌర సేవలు,

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాజమహేంద్రవరం, ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “డబల్ వన్ డబల్ జీరో” మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు  మరియు నమోదైన మీ అర్జీ యొక్క స్థితిగతులు తెలుసుకో వచ్చునని ఆమె తెలిపారు. జూన్  30 ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం meekosam.ap.gov.in  పోర్టల్ లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు.  నేరుగా అర్జీలు ఇవ్వలేని వారు మీ కోసం వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌ ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని ఆమె తెలియ చేశారు.

వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  ద్వారా ప్రజలకి పౌర సేవలు పొందవచ్చు అని పేర్కొన్నారు. అందుకోసం ప్రజలు వారి సెల్ ఫోన్లు లో ఈ నంబర్ సేవ్ చేసుకోవాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PGRS will be open

You cannot copy content of this page

Scroll to Top