Ambedkar Sena : అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం

TRINETHRAM NEWS

తేదీ:14:05:2025 : ప్రొద్దుటూరు :

అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్, దప్పెల్ల దేవదాసు

అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్.బి.సాగర్

విషయం : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్స్ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుట గురించి….
మన రాష్ట్రం లోని పేదల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లో ఏర్పాటు చేసి ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ఏపీ స్టడీ సర్కిల్స్ కి పర్మనెంట్ ఆఫీసర్స్ , కోఆర్డినేటర్స్ ను ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ లో వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు నిరంతరం శిక్షణ జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. 2005 నుండి 2020 వరకు నిరంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పీపీపీ ఆధ్వర్యంలో DSC కి శిక్షణ ఇస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. పీపీపీ విధానాన్ని ఆపు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫీసరు ను, కోఆర్డినేటర్ లను నియమించి అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition to the Deputy Tahsildar

You cannot copy content of this page

Scroll to Top