Trinethram News : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ సలహాదారులతో చర్చలు జరిపింది. స్టే ఎత్తి వేయాలని సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేయనుంది. రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కుల గణన చేపట్టి అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దానికి అనుగుణంగా జీవో నెంబర్ 9 జారీ చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


