Mosquito-Borne Diseases : గ్రామం లో దోమల బెడద రోగాలతో ఆస్పత్రి పాలవుతున్న జనాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఆగష్టు 2 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామం లో దోమలతో బెంబేలెత్తుతున్న ప్రజలు దోమలకు ఆవాసంగా డ్రైనేజీ కాలువలు ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్య ధోరణిలో అధికారులు ప్రభుత్వం మారిన అధికారుల తీరు మారదా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా దోమలు స్వైర్యా విహారం చేస్తూ ప్రజలను కుడుతూ రోగాల బారిన పడేలా చేస్తున్నాయి ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దోమ కాటు నుండి తప్పించుకో లేకపోతున్నారు అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు డ్రైనేజీ కాలువలు పొంగి రోడ్లపై వర్షపు నీరు డ్రైనేజ్ నీరు చేరి దోమలకు ఆవాసంగా మారాయి గ్రామంలో దోమల బెడద పోవడం లేదని రాత్రిపూట ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి సాయంత్రం ఆరు గంటలకే తలుపులు వేసుకుంటున్నారు ప్రజలు వారి నివాసాల్లో దోమల నియంత్రణ మందులు ఎన్ని వాడుతున్నా ఫలితాలు కనిపించడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు దోమల నివారణ పై దృష్టి సాధించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి గ్రామంలో కొన్ని డ్రైనేజీ కాలువలలో మురుగు నీరు పారుదల ముందుకు సాగే విధంగా లేకపోవడంతో దోమలు వాటిని ఆవాసంగా చేసుకొని ప్రజలు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ కాలువల వద్ద పిచికారి ఫాగింగ్ చేసి దోమలను అరికట్టాలని సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు అధికారులు స్పందించి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

mosquito-borne diseases

You cannot copy content of this page

Scroll to Top