Road Divider Becomes Dangerous : ఎండపల్లి వలస వద్ద ప్రమాదకరంగా మారిన రహదారి డివైడర్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అరకులోయ)టౌన్ త్రినేత్ర న్యూస్ ఆగస్టు 03 : అరకు నుండి అరకు వ్యాలీ టౌన్ కి వెళ్లే ప్రధాన రహదారిలో అరకు రైల్వే స్టేషన్,ఎండపల్లి వలస గంగమ్మతల్లి గుడి సమీపంలో ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయంలో అక్కడ స్ట్రీట్ లైట్లు లేకపోవడం, డివైడర్‌పై ఎలాంటి సేఫ్టీ బోర్డులు లేకపోవడం వల్ల వాహనదారులకు డివైడర్ కనిపించక, తరుసు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట, డివైడర్ మార్గంతో కలసిపోయినట్టే ఉండటంతో ప్రమాదానికి గుట్టుచప్పుడు కాకుండానే దారితప్పే పరిస్థితి ఏర్పడుతోంది అని స్థానికులు, వాహన శోధకులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు చురుకుగా స్పందించి తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road divider becomes dangerous

You cannot copy content of this page

Scroll to Top