- రంగాపురం కుడుముల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
- 3 అడుగుల అనుమతికి మించి 10 అడుగుల లోతు వరకు తవ్వకం
- 166 ట్రక్కుల మట్టి అక్రమంగా ఇతర గ్రామాలకు తరలింపు
- రైతు పొలంలో మెరక పేరిట ప్రైవేట్ లేఔట్లకు మట్టి సరఫరా
- ఉపాధి హామీ కూలీలకు పని లేకుండా నష్టం
- అవినీతిని అడ్డుకునేందుకు పోరాడుతున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
- రంగాపురం గ్రామ ప్రజల తరపున మాజీ ఎమ్మెల్యే,కి కృతజ్ఞతలు
త్రినేత్రం న్యూస్ : అనపర్తి : రంగాపురం కుడుముల చెరువు ఆయకట్టు రైతు రాజేష్, మాట్లాడుతూ, కూటమి నాయకులు అభివృద్ధి పేరుతో అక్రమంగా మట్టిని తవ్వి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, నిరంతరం పోరాటం చేస్తున్నారని, అదే సమయంలో ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం రంగాపురం గ్రామ సర్పంచ్ జి. వీరభద్రరావు, మాట్లాడుతూ, తాను ఇచ్చిన తీర్మానంలోని నిబంధనలను కూటమి నాయకులు పూర్తిగా పట్టించుకోలేదని విమర్శించారు. కేవలం 3 అడుగుల లోతు వరకు మాత్రమే మట్టి తవ్వేందుకు అనుమతి ఉండగా, నిబంధనలను ఉల్లంఘించి సుమారు 10 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వి ఇతర గ్రామాలకు తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
166 ట్రక్కుల మట్టిని కేవలం ఒక రైతు పొలంలో మెరక వేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ రైతు పొలంలో ఎలాంటి మెరక వేయకుండా, ఆ మట్టిని ఇతర గ్రామాల ప్రైవేట్ లేఔట్లకు తరలించి లాభాలు పొందుతున్నారని అన్నారు. ఈ అక్రమాల వల్ల ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ఉపాధి కోల్పోయి వారి పొట్ట కొట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుడుముల చెరువులో జరుగుతున్న అవినీతి, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు ధైర్యంగా పోరాడుతున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,కి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


