జూలై 7, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్..
కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా వింజమూరు ఆటోమొబైల్స్ డీలర్స్ టెక్నికల్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే . కాకర్ల సురేష్, సంఘీభావం తెలిపారు. స్థానిక బంగ్లా సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు సెల్ ఫోన్ టార్చ్ లైట్ మరియు కొవ్వొత్తులను వెలిగించి మౌనంగా ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ భారతదేశం ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఇటువంటి కుట్ర చేశారన్నారు. 28 మంది భారతీయులను ఎక్కడకక్కడ పేర్లు అడిగిమరీ ఉగ్రవాదులు పాశవికంగా చంపడం అత్యంత బాధాకరమన్నారు. దేశ చరిత్రలో ఏప్రిల్ 22 ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదులను తుదముట్టించాలని ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ యూనియన్ నాయకులు అంకినపల్లి రఘురాం రెడ్డి గువ్వల రవీంద్రారెడ్డి కదిరి రంగారావు బ్రహ్మయ్య ఉద్ద గిరి శ్రీనివాసులు షేక్ రఫీ మదన్మోహన్ వెంకటయ్య మల్లికార్జున శ్రీనివాసులు మహేంద్ర ఈసీ నెంబర్లు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peaceful rally in protest

You cannot copy content of this page