సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానికంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఉగ్రదాడిలో మరణించిన వారిని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని పేర్కొన్నారు. కాశ్మీర్ లో పర్యాటకులను కిరాతంగా చంపిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను (లష్కరేతోయిబా) వెంటనే గుర్తించి అంతం చేయాలని, ఉగ్ర దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా బహిష్కరించి ఒంటరిగా చేయాలని వాణిజ్య వ్యాపార పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సామాన్య పౌరులపై ఉగ్రవాదులు దాడులు చేయడం హేయమైన చర్య అని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ ఘటనను ముక్తకంఠంతో దేశ ప్రజలందరూ ఖండించాలని కోరారు. మృతి చెందిన భారత పౌరుల కుటుంబాలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి తరపున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


