త్రినేత్రం న్యూస్ : పెదపూడి మండలం పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో “ప్రజా సమస్యలపై పిర్యాదుల స్వీకరణ” కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి పలు అంశాలపై పిర్యాదులు స్వీకరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్బంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ
“ప్రజా సమస్యలపై పిర్యాదుల స్వీకరణ” కార్యక్రమంలో ఈ రోజు ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై పిర్యాదులు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా పెదపూడి మండలంలో పలు గ్రామాల నుండి ప్రజలు పక్క పక్క పొలాలు సరిహద్దు సమస్యలు, పక్క పక్క యిండ్ల స్థలాలు సరిహద్దు సమస్యలు ఆర్టీసీ బస్సు సౌకర్యం,వైద్యం,త్రాగునీరు తదితర సమస్యలను తెలియచేసారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతులను ఆయా శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారించే దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో పెదపూడి మండల అధికారులు,పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు,పెదపూడి గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


