PCC President Sharmila : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గృహనిర్బంధం – బీజేపీ దాడులను కాంగ్రెస్ ఖండన

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకువేలి),త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ మే 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో ఎటువంటి నోటీసు లేకుండా అకారణంగా గృహనిర్బంధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇందుకు సంబంధించి అరకువేలి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి, “ఒక మహిళా నాయకురాలిని నిర్బంధించడం ద్వారా కూటమి ప్రభుత్వం ఎంత భయభ్రాంతులకు లోనైందో స్పష్టమవుతోంది” అని వ్యాఖ్యానించారు.
పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా, నేతలతో సమావేశాలు జరిపించకుండా ఆమెను నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలపై జరిగిన ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ “పిరికిపంద చర్యగా” అభివర్ణించింది.
ఇక మరోవైపు, విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడికి పాల్పడిన ఘటనపై కూడా చిన్నస్వామి తీవ్రంగా స్పందించారు. కోడిగుడ్లు, గాజు పెంకులు, టమాటాలతో జరిగిన ఈ దాడిని “గుండాల చర్య”గా అభివర్ణిస్తూ, దానికి బాధ్యత వహించే బీజేపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తెల్లగంజి సోమేశ్వరరావు, బీసీ సెల్ చైర్మన్ కన్నూరి ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు శెట్టి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PCC President Sharmila under

You cannot copy content of this page

Scroll to Top