కాకినాడ సెజ్‌లో నిరుపయోగంగా వేల ఎకరాల భూములు
పరిశ్రమలు పెట్టండి లేదా తిరిగి భూమి పేదలకు ఇవ్వండి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
స్మార్ట్ మీటర్లు ను మీ ఇంటికి తీసుకువస్తె వారి ముందే బద్దలు కొట్టండి
సీపీఐ జిలా నేతలు కె బోడకొండ, తోకల ప్రసాద్ పిలుపు
Trinethram News : త్రినేత్రం న్యూస్ ప్రతినిది, కాకినాడ, జూలై 13 : కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమల జాడ కనిపించడం లేదని పరిశ్రమలు వస్తే తమకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న యువత ఆశలపై ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నీళ్లు చల్లుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు
ఆదివారం మధ్యాహ్నం స్థానిక పొన్నంమండ రామచంద్ర రావు భవన్ లో సీపీఐ కాకినాడ నగర 23 వ మహాసభ పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పార్టీ పతకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఆవిష్కరించారు.. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నమండ రామచంద్ర రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ముందుగా మధు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని అంతా ఎదురుచూస్తున్నారని కానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయన అన్నారు
కాకినాడ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను 2003లో ప్రారంభించారని 2005 డిసెంబర్, 2006 జనవరిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యిందిని కాకినాడ పరిసరాల్లో ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటుతో సహా పలు ఆయిల్ కంపెనీలు తీసుకొస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పుకొచ్చిందిని . నాడు 2,587.50 ఎకరాల పరిధి మేరకు మాత్రమే కాకినాడ సెజ్‌కు కేంద్రం అనుమతులిచ్చిందిని
కానీ, రాష్ట్ర ప్రభుత్వం 5,120 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరించిందిని మధు విమర్శించారు 19 ఏళ్లు దాటుతున్నా పరిశ్రమలు రాకపోగా భూములన్నీ ఖాళీగానే ఉన్నాయిని ఏళ్లు గడుస్తున్నా సెజ్ భూముల్లో పట్టుమని పది ఎకరాల విస్తీర్ణంలోనైనా కార్యకలాపాలు కనిపించడం లేదని చైనాకు చెందిన పల్స్ ఫ్లష్ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్ నడుపుతోందిని మరో మూడు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు మాత్రమే నెలకొల్పారు
ని అన్నారు కొందరు మహిళలకు మాత్రమే వీటిలో ఉపాధి లభిస్తుంది. రూ.32 కోట్లతో కాకినాడ పెట్రో కారిడార్ పేరుతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం తప్ప పనులు జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు
ఏ ఉద్దేశంతో అయితే రైతుల నుంచి భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరలేదని, సెజ్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గతేడాది నవంబర్ 4న పిఠాపురం పర్యటనలో పవన్ కల్యాణ్ అన్నారని కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు తెచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు గతేడాది జులై 3న జరిగిన బహిరంగ సభలో సైతం హామీ ఇచ్చారని భారీ మెజారిటీతో గెలిపించిన తరువాత పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలోనూ ఆయన సెజ్ గురించి ప్రస్తావించారని కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు
సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ లు మాట్లాడుతూ స్మార్ట్ కరెంట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించండని, కరెంట్ బిల్లులు పెంచేందుకే స్మార్ట్ మీటర్లు బిగింపు అని, స్మార్ట్ మీటర్ల బిగింపు రద్దుకై ఊరంతా ఏకమవ్వాలని, స్మార్ట్ మీటర్ల్ని బద్దలు కొట్టండి వారు పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపెందుకు, ఆదాని ఆదాయాన్ని పెంచేందుకు స్మార్ట్ మీటర్లను బిగింపు ఒప్పందంలో భాగంగా లాభం చేకూర్చేందుకు స్మార్ట్ మెటల్ బిగింపు ప్రక్రియ జరుగుతుందని, ప్రజలకు ఉరితాడులు బిగించే చందంగా స్మార్ట్ మీటర్లు బిగించుటకు ప్రయత్నం వారన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీ ఇంట్లో ఫ్యానో, ఫ్రిడ్జ్, టీవీ అన్ని ఆపిన, మీటర్ మాత్రం గిరగిరా గిరా తిరుగుతా ఉంటుందిని. బిల్లు కట్టేందుకు మీ కళ్ళు గిరా గిరా తిరిగే పరిస్థితి వస్తుందని వారన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు పై ప్రజలంతా ఏకమవాలని ముక్తకంఠంతో స్మార్ట్ మీటర్ల రద్దు చేసే వరకు సిపిఐ ఆధ్వర్యంలో పోరాట ఉద్యమం ఉంటుందని వారు అన్నారు.
ఇంకా ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం, మహిళా సంఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని, ఆర్టీసీ నాయకులు ఎమ్మెస్, అగ్రిగోల్డ్ నాయకులు రాంబాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు జయకుమార్, ఏఐవైఎఫ్ నాయకులు కాశీ విశ్వనాథ్ తదితరులు ప్రసంగించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


