Trinethram News : తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు శనివారం పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించిందని, వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చిత్తేరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన సమయంలో రైల్వే ట్రాక్‌లో కొంత భాగం విరిగిపోయినట్లు సమాచారం. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


