Korivi Krishna Swamy Mudiraj : పరిగి పట్టణంలో ఘనంగా కొరివి క్రిష్ణా స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మునిసిపాలిటీలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పరిగి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో రచయిత జర్నలిస్టు హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 132వ జయంతి కార్యక్రమాన్ని పరిగి మున్సిపాలిటీ సంఘం అధ్యక్షులు దోమ శ్రీశైలం ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కృష్ణస్వామి ముదిరాజ్ బహుముఖ ప్రజ్ఞశాలి, రచయిత, జర్నలిస్ట్, విద్యావేత్త మరియు హైదరాబాద్ పై ఒక కళాఖండంగా నిలిచిన ‘పిక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్’ రచయిత మరియు
కొంతకాలం పాటు ఆయన అప్పటి ప్రధానమంత్రి మహారాజ్ కృష్ణ ప్రసాద్ కు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు.కొర్వి కృష్ణ స్వామి ‘డెక్కన్ స్టార్’ అనే ఇంగ్లీష్ వారపత్రిక మరియు ‘మసావత్’ అనే ఉర్దూవారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన “న్యూ ఎరా” కు కూడా సంపాదకుడిగా పనిచేశారు మరియు సియాసత్, రాయత్, రహ్నుమా-ఎ-డెక్కన్, ఎమ్రోజ్ వంటి అనేక ఉర్దూ దినపత్రికలలో కాలమ్స్ రాశారు. క్రిష్ణ స్వామి ముదిరాజ్ 25 సంవత్సరాలు కౌన్సిలర్ గా మరియు మేయర్‌గా ఉన్న సమయంలోనే హైదరాబాద్ కోసం ఒక మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేశారు.
ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు దోమ రామచంద్రయ్య ముదిరాజ్, నియోజకవర్గ కార్యదర్శి డి. కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, పరిగి నియోజకవర్గం యువత అధ్యక్షులు పర్షమోని బాబు ముదిరాజ్, సంఘం నాయకులు జనార్థన్ ముదిరాజ్, మహిపాల్ ముదిరాజ్, కృష్ణా ముదిరాజ్, బందయ్య ముదిరాజ్, డి. ప్రవీణ్ ముదిరాజ్, ఆనంద్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

birth anniversary of Korivi Krishna Swamy Mudiraj

You cannot copy content of this page

Scroll to Top