త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సంకల్పంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మరియు చదువుపై ప్రేరణ కలిగించేందుకు ప్రత్యేకమైన నిపుణులచే మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ములకలపల్లి మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ స్పీకర్ సురేంద్ర ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
విద్యార్థులు ధైర్యంగా మాట్లాడటం, ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను సులభమైన టెక్నిక్‌లతో గుర్తుంచుకోవటం,పరీక్షల సమయంలో తడబడకుండా సమాధానాలు రాయటం, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలను గౌరవించడం, సమాజంలో మారుతున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం, క్షణికావేశాలకు లోనుకాకుండా చిన్న వయసులోనే ఆత్మహత్యల వంటి తప్పుడు నిర్ణయాలకు పోకుండా ఉండటం, ఆకర్షణలకు లోనై ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉన్నతమైన లక్ష్యాలను సాధించటంపై ముఖ్యమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మండల నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, కటికనేని ఆదిత్య, కళాశాల ప్రిన్సిపాల్ కల్పన మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


