జూన్ 26, 2026
TRINETHRAM NEWS
PACS

PACS : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ ; మే 14 ; దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, పెద కడిమి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) కార్యదర్శి సిహెచ్ రమేష్ బాబు మాట్లాడుతూ సకాలంలోనే సంబంధిత రైతులకు ఎరువులు, విత్తనాలు అందించమని తెలిపారు.

మొక్కజొన్న, వరి తదితర పంటలు పండించారని అన్నారు ఆ సొసైటీలో పదిహేడు వందల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని సూచించారు. రూపాయలు ముప్పై కోట్లు స్వల్ప, మధ్య కాలిక (కెసిసి) పద్ధతిలో బ్యాంకు రుణాలు అందించామని పేర్కొన్నారు.
తొంభై శాతం వరకు రికవరీ చేసినట్లు తెలిపారు. చైర్మన్ పసురాజు వీర వెంకట ప్రసాద్ రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు వెన్నుముక్కగా నిలుస్తున్నారు అని సంతోషాన్ని వ్యక్తపరిచారు. రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page