
Trinethram News : హైదరాబాద్: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు గుర్తించారు. శామీర్‌పేట్ హ్యాపీ హోమ్స్ పేరుతో ప్లాట్లను విక్రయిస్తున్నానని బాధితుల నుంచి సేల్ డీడ్‌ల రూపంలో సుబ్రహ్మణ్యం నగదు వసూలు చేశాడు. ఇందులో దాదాపు 400 మంది బాధితులు ఉన్నారని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
