జూలై 11, 2026
TRINETHRAM NEWS
Open Himayat Sagar Reservoir Gates

Open Himayat Sagar Gates : త్రినేత్రం న్యూస్ : జంట జలాశయాల క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నీటి మట్టాన్ని నియంత్రించేందుకు నేడు (28.06.2026) సాయంత్రం 6:00 గంటలకు హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫ్లడ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

ప్రారంభ దశలో గరిష్టంగా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నందున జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, హైడ్రా జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page