Collector’s Conference : జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు స్వర్ణాంధ్ర 2047- పది సూత్రాలపై చర్చ

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఒక మీటరు భూగర్భజలం పెరిగితే కనీసం 5 వేల కోట్ల మేర ఆదా అవుతుంది.
అలాగే పర్యావరణ రక్షణ జరుగుతుందన్న సీఎం.. జీరోపావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, నైపుణ్యం- ఉపాధి కల్పన, నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన నిర్వహణ, ప్రాడెక్టు పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చ.. పీ4 ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించటంతో పాటు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఫ్యామిలీ కార్డు జారీ , ప్రజారోగ్యం తదితర అంశాలపై ప్రజెంటేషన్లు… రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తక్కువగా నమోదయ్యేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచనలు

ప్రజారోగ్యం కాపాడేలా పౌల్ట్రీ సహా ఇతర మాంసపు ఉత్పత్తుల్లో గ్రోత్ ప్రమోటర్లను నియంత్రించాలని ఆదేశం.. రాష్ట్రంలో నీటి భద్రత పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచనలు.. 38,400 పైచిలుకు మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపుతున్నామని ప్రజెంటేషన్ లో వివరించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్.. వర్షాకాలం పూర్తి అయ్యే సరికి భూగర్భ జలాలు 3 మీటర్లుగా ఉండాలి. వర్షాకాల సీజన్ మొదలు నాటికి 8 మీటర్ల కంటే లోతుకు వెళ్లకూడదని ముఖ్యమంత్రి సూచనలు.. చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కలెక్టర్లతో పంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

తిరుపతికి వెళ్లే దారిలో చెరువులన్నీ నీటితో నిండుగా కళకళలాడుతున్నాయని ..ఆ నీటిని చూసిన ప్రజల్లో నూతన ఉత్సాహం వస్తోందని వ్యాఖ్యానించిన సీఎం… నీటి వనరుల్ని సంరక్షించటంతో పాటు నీటితో నిండుగా ఉండేలా చూడాలి…

  • పుష్కలంగా నీరున్నందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు కొత్త కష్టాలు వచ్చాయని సరదాగా వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని అన్ని చెరువులూ నింపాలని అవసరమైతే మొబైల్ లిఫ్టు పంపులు ద్వారా చెరువులు నింపాలని సూచనలు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలోని నీటి వనరులు, రిజర్వాయర్లు 95 శాతం నిండుగా ఉండాలని దీనిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని ఆదేశం

  • ఒక మీటరు భూగర్భ జలం పెరిగితే 745 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులోకి వచ్చినట్టేనని తెలిపిన సీఎం

ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకానికి 14,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోందని తెలిపిన అధికారులు

  • దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్టు వెల్లడి

ఆక్రమణలతో పాటు కాలుష్యానికి గురైన డ్రెయిన్లను కలెక్టర్లు క్లియర్ చేయించాలని సూచన.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector's Conference, Swarnandhra 2047- Discussion on ten principles

You cannot copy content of this page

Scroll to Top