సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
BRS legal battle

ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.

-ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు.. -న్యాయమే గెలిచింది
రాజ్యాంగం ముందు అహంకారం బద్దలైంది
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

BRS Legal Battle : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 18, త్రినేత్రం న్యూస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన న్యాయపోరాటానికి ఫలితమని బీఆర్‌ఎస్‌ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన వారికి ఈ తీర్పు ఒక గుణపాఠమని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచి, అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయని, స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.

తెలంగాణ హైకోర్టు శుక్రవారం దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూర్చిందని రవీంద్ర కుమార్ అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.“ప్రజల తీర్పును, పార్టీ గుర్తుపై వచ్చిన విజయాన్ని గౌరవించాలి. పదవుల కోసం పార్టీలు మారడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఫిరాయింపు రాజకీయాలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. న్యాయమే గెలిచింది.. రాజ్యాంగమే నిలిచింది” అని రవీంద్ర కుమార్ అన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయపోరాటం భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page