తేదీ: 29/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు , జంగారెడ్డిగూడెం మండలం, పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి . కిషోర్ ఉమ్మడి కూటమి నాయకులతో తుఫాన్ ముంపుకు గురైన వాళ్లను మండల తహసిల్దార్, మున్సిపల్ కమీషనర్, సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక గద్దే లక్ష్మి నరసమ్మ బాలికల హైస్కూల్ నందు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వాళ్లకు ఎప్పటికప్పుడు అధికారులతో మొంథా తుఫాన్ ప్రభావంపై శాసనసభ్యులు ముందస్తు చర్యలు మరియు తదుపరి చర్యలపై సమీక్షా సమావేశ నిర్వహించారు..ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం మన అందరి బాధ్యత అని చెప్పారు.ఎక్కడా అలసత్వం వహించకుండా, ప్రతి అధికారీ, ప్రజా ప్రతినిధి కర్తవ్యపరంగా వ్యవహరించాలని సూచించారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.వాటిని అందరికీ సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు.గ్రామాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అక్కడ మెడికల్ క్యాంపు ద్వారా ప్రజలకు ధైర్యం తెలియజేయాలని. ఏ అనుకోని విపత్తునైనా ఎదుర్కోవడానికి మన యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కె.స్లీవజోజి,రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్ర రాజు,రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వర్రావు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, గెడా సుబ్రహ్మణ్యం, మరియూ సచివాలయ సిబ్బంది,రెవెన్యూ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


