తేదీ : 10/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, రావికంపాడు పంచాయతీ లో బీసీల ఆత్మీయ సమావేశంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధికి శాసనసభ్యులకు మరియు ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయని ప్రజలు చెప్పడం జరిగింది. మళ్లీ మళ్లీ ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


