ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2025 01 30 at 14.37.07

TRINETHRAM NEWS

ఓ మహాత్మా 420 హామీలు అమలుచేసే తెలివి, మనసు ఈ ప్రభుత్వానికి ప్రసాధించు: మెతుకు ఆనంద్

Trinethram News : వికారాబాద్ : ఈరోజు గాంధీ వర్ధంతి సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ లో గల మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులైన కూడా ప్రజలకి ఇచ్చిన 420 హామీలను అమలు చెయ్యటంలో విఫలం అయిందని, వాటిని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వానికి మేలుకొలుపు అయ్యేలా చూడాలని గాంధీజీ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

వినతి పత్రం లో
ఓ మహాత్మా….ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొలుపు, ప్రజలకు సేవా చేసేలా చూడు.

రాష్ట్ర సాధన అనంతరం గడిచిన 10 సంవత్సరాలలో BRS పాలనలో ప్రగతి పథంలో నడిచిన తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తూ ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది.

కానీ గత ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ కాలం వెళ్ళదీస్తూ ప్రజలను సర్వేల పేరుతో మోసం చేస్తుంది.

ఇప్పటికైనా 420 హామీలు అమలుచేసే తెలివి, మనసు ఈ ప్రభుత్వానికి ప్రసాధించాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్ధిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్, అనంత్ రెడ్డి, రామస్వామి, కృష్ణ రెడ్డి, రాములు, లక్ష్మణ్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్, PACS వైస్ చైర్మన్ పాండు, గంగారం వెంకట్, వికారాబాద్ మండలం మాజీ సర్పంచ్ ల సంగం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, వికారాబాద్ మండల మైనారిటీ అధ్యక్షులు గయాజ్, వికారాబాద్ పట్టణ మైనారిటీ జనరల్ సెక్రటరీ MD అఫ్జల్ పాషా (షకీల్), మాజీ సర్పంచ్ అంజయ్య, నాయకులు అనంతయ్య, గాండ్ల మల్లికార్జున్, మహిపాల్ రెడ్డి, వేణుగోపాల్, ఇంజనీర్ మల్లేష్, దత్తు, ఇస్మాయిల్, మంచన్ పల్లి సురేష్, సుభాన్ రెడ్డి, సుభాష్, BTS నర్సింహా, పట్టణ BC సెల్ లక్ష్మణ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు గిరీష్ కొఠారి, ఉపాధ్యక్షులు తేజ, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, మల్లేష్, రాజు, మల్లేష్ యాదవ్, సత్యనారాయణ, కిషోర్, వెంకటాపూర్ తండా శీను, శ్రీనివాస్ రెడ్డి, సిద్ధూ్లూర్ శీను, అత్వెల్లి మోహన్, పాతూర్ తిరుపతి రెడ్డి, ఎన్నెపల్లి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page