జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 14.48.01

TRINETHRAM NEWS

సాధ్యం కానీ హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ . రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సాధ్యం కానీ హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. డిక్లరేషన్ ల పేరుతో, హామీల పేరుతో గ్యారంటీ ల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తా మని చెప్పి హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీలపై రకరకాల సాకులు కాలం వెళ్లదీస్తూ కొన్ని పథకాలకు ఏవేవో కారణాలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. మా కెసిఆర్ ప్రభుత్వంలో 6,47,479 నూతన రేషన్ కార్డు లు జారి. రేషన్ కార్డులు జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమమని ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావ దారిద్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, ఇచ్చి మరి ప్రజలను మోసగించారు. తెలంగాణ యువతకు ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేశారు. ఇక్కడ ఉన్న రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వండని అడిగి నిరుద్యోగులను తీవ్రంగా కొట్టి జైల్లో వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము. కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ని, కోట్ల ప్రజాధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్ధాల పలికి ఇప్పటివరకు వారికి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదు. మోసపోయిన ప్రజల తరఫున మా బి ఆర్ ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణమాఫీ అయింది. రైతు భరోసా 15000, రైతు కూలీలకు 12000 అని చెప్పి ఇప్పుడు రైతు భరోసా 12000, అంటూ ఒకసారి సంక్రాంతి మరోసారి జనవరి 26 ఇస్తామని ఇప్పుడు మళ్లీ మార్చి 31 అంటున్నావు. ఇవన్నీ బూటకపు మాటలు,
రైతుబంధు సంవత్సరానికి రెండు విడతలుగా క్రమం తప్పకుండా ఎకరాకు 10000 చొప్పున 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ఘనత మా కేసీఆర్ ప్రభుత్వానిది. మీ అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వందమందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేస్తున్నారు, గురుకులాల్లో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని 55 మంది పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి వారికి ఆర్థిక సాయం అందించేవారు.
ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల్లో చేనేతలకు ఉపాధి కూడా లేదు. గ్రామ సభలో మీరు ఇచ్చిన హామీ హామీలను గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను ప్రజలను పోలీసులతో కాంగ్రెస్ కుండాలతో కొట్టిస్తున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బి ఆర్ ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి మహాత్మా గాంధీకి వినతి పత్రం అందించిన మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి,b r s పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామవత్ రవీంద్రకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ b r s పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page