NTR Medical Services Closed : ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

TRINETHRAM NEWS

తేదీ : 25/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడలో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే వచ్చేనెల అనగా అక్టోబరు పద వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామని రాష్ట్ర స్పెషాలిటీ వైద్యశాల అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. ఇప్పటికే పలు సేవలు నిలిపివేసిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వాపోయింది.
తక్షణమే రూపాయలు ఆరువందల డెబ్బై కోట్లు బకాయిలు చెల్లించి, మిగిలిన రూపాయలు రెండు వేల కోట్లు బకాయిలపై కార్యచరణ ప్రకటిస్తేనే చర్చలకు వెళ్తామని తెలిపింది. పెద్ద ఎత్తున బకాయిలతో వైద్యశాల నిర్వహణ కష్టమవుతుందని తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NTR Medical Services Closed

You cannot copy content of this page

Scroll to Top