
Trinethram News : చాలా మంది ప్రయాణీకులు (IRCTC) వెబ్‌సైట్ లేదా ఇతర యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేస్తారు.
అయినప్పటికీ, చాలామంది రైల్వే ప్రయాణికులు కౌంటర్‌కి వద్దకు వెళ్లి మరి రైలు టిక్కెట్లు కొనే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ, కౌంటర్ వద్ద కొనుగోలు చేసిన రైలు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కూడా రద్దు చేసుకోవచ్చని మీకు తెలుసా?
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ఇదే అంశంపై మాట్లాడుతూ.. టికెట్ కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్ లేదా ఎంక్వైరీ నంబర్ 139 ద్వారా ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవచ్చు. అయితే టికెట్ రీఫండ్ అమౌంట్ మాత్రం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా రైల్వే రిజర్వేషన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు.
పార్లమెంటులో రైల్వే మంత్రి ఇంకా ఏమన్నారంటే? :
రైల్వే టికెట్ రద్దు చేసుకునే ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి ప్రశ్నించారు. రైల్వే ప్యాసింజర్ (టికెట్ క్యాన్సిల్, రీఫండ్) రూల్స్ 2015లో నిర్దేశించిన సమయ పరిమితి ప్రకారం.. PRS కౌంటర్ (రైల్వే రిజర్వేషన్ సెంటర్) నుంచి తీసుకున్న వెయిట్‌లిస్ట్ టికెట్‌ను సరెండర్ చేస్తే.. రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ రద్దు అవుతుందని వైష్ణవ్ రాజ్యసభలో ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
“అయితే, సాధారణ పరిస్థితులలో రైల్వే ప్యాసింజర్ (టికెట్ క్యాన్సిల్, ఛార్జీల రీఫండ్) రూల్స్ 2015 ప్రకారం.. IRCTC వెబ్‌సైట్ లేదా 139 ద్వారా PRS కౌంటర్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్ల ఒరిజినల్ PRS కౌంటర్‌లో టికెట్‌ను సమర్పించడం ద్వారా రీఫండ్ మొత్తాన్ని పొందవచ్చు” అని ఆయన అన్నారు.
IRCTC కౌంటర్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా క్యాన్సిల్ చేయాలి? :
- కౌంటర్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేసే ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
- మీరు ‘More’ యాక్షన్‌కి వెళ్లి కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ టికెట్‌ను క్యాన్సిల్ లేదా బోర్డింగ్ పాయింట్ వివరాలు కనిపిస్తాయి. - టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ PNR, సెక్యూరిటీ క్యాప్చా (Captcha)ను ఎంటర్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ తర్వాత మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
వివరాలను చెక్ చేసిన తర్వాత ‘టికెట్ క్యాన్సిల్’ఆప్షన్‌పై క్లిక్ చేయండి. - ఆ తరువాత మీ రీఫండ్ మొత్తం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- కన్ఫర్మేషన్, రీఫండ్ వివరాలతో మీకు SMS వస్తుంది.
టికెట్ రీఫండ్ కోసం మీరు ఏం చేయాలంటే? :
కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన రైల్వే టికెట్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవచ్చు. కానీ, టికెట్ రీఫండ్ పొందడానికి మీరు మీ సమీప PRS కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్ చూపించడం ద్వారా మీరు రీఫండ్ అమౌంట్ తిరిగి పొందవచ్చు.
అయితే, రీఫండ్ పొందడానికి మీరు రైలు షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం 4 గంటల ముందు PRS కౌంటర్ చేరుకోవాలని గుర్తుంచుకోండి. అంతేకాదు.. వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టిక్కెట్లను రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు కౌంటర్‌లో డిపాజిట్ చేయవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
