శ్రమ దోపిడీ, సామాజిక అణచివేత, వివక్షల అంతంకై పోరాడుదాం. సామాజిక న్యాయ సాధన క్యాంపియన్ ను జయప్రదం చేద్దాం.
ఆరేపల్లి రాజమౌళి ఆర్జీవన్ అధ్యక్షులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీ -1 జీడీకే -11 ఇంక్లైన్ ఉద్యోగస్తుల నుండి విరాళాలు సేకరిస్తున్న సిఐటియు పిట్ కమిటీ బృందం ఆర్జీ -1 బ్రాంచి అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగడం అమానుషం కులం మతం ప్రాంతం లింగ భేదం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని, కార్మిక వర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికి అడ్డంగా, ముళ్లకంచలా ఉన్నాయి, దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం పాలకవర్గాలు కార్మిక వర్గంలో సున్నితమైన అంశాలను ముందుకు తెస్తున్నారని,
దాంతో కార్మికవర్గ ఐక్యతను విచ్చిన్నం చేసి దోపిడి వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. అని సమాజంలో అన్ని రకాల దోపిడీ, అణచివేత వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి వీటి నుండు శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు తన ఆవిర్భావం నుంచి పని చేస్తున్నదని, సామాజిక అణిచివేత, కులవివక్ష, దోపిడీలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటలతో శ్రామిక వర్గ ఐక్యత కోసం కృషి చేస్తుందన్నారు, అందులో భాగంగా 2025 ఏప్రిల్ 6నుండి 14వరకు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపియన్ నిర్వహించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని,
ఈ క్యాంపియన్ లో సిఐటియు అనుబంధ సంఘాలన్నీ భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మిక వర్గంలో సామాజిక న్యాయ సాధన క్యాంపియన్ సింగరేణిలో విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1 బ్రాంచి కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగస్తులలో సామాజిక న్యాయం కోసం కులవివక్ష అంతం కోసం పోరాడుతున్న సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని ఉద్యమాలు నిర్మించేందుకు, సామాజిక ఉద్యమ నిది సేకరిస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఆర్జీవన్ సహాయ కార్యదర్శి జెల్ల గజేంద్ర, బోగ్గారం శ్రీనివాసరావు, పిట్ సెక్రటరీ జంగపల్లి మల్లేష్, సిహెచ్ దేవెంధర్, మునుకుంట రామన్న, శివ, ఉద్యోగస్తులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


