
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపిన గ్రామ సర్పంచ్ .
Nizam Nagar students Excel : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 25, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా, డిండి(గుండ్లపల్లి)మండలం, నిజాం నగర్ గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాల(ఎంపిపిఎస్)విద్యార్థులు మంగళవారం వెలువడిన టిజి సెట్ -2026 గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలలో 10 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9 మంది విద్యార్థులు వివిధ రకాల గురుకులలో సీట్లు సంపాదించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్, ఉపాధ్యాయుడు రవి ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని అతి చిన్న గ్రామ పంచాయతీలలో రెండవది అయినా మరియు మారుమూల ప్రాంతమైన పాఠశాల నుండి ఇంతమంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం గర్వకారణమని గ్రామ సర్పంచ్ వింజమూరి శశికళ శేఖర్ విద్యార్థులకు,ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులలో 90% ఉత్తీర్ణులు కావడం సంతోషకరమైన విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
వివిధ గురుకులంలో అర్హత సాధించిన విద్యార్థులు:
1.ఇ.మేఘన(డిండి)
2.ఇ.ప్రియదర్శిని(డిండి)
3.బి.ఇన్షిత(డిండి)
4.బి.ప్రవళిక (డిండి )
5.బి.హేమశ్రీ (మల్లేపల్లి)
6.ఇ.అశ్వంత్ (కొమ్మేపల్లి)
7.కె.చరణ్ (కొమ్మేపల్లి)
8.ఎం.సాత్విక్ (అనుముల)
9.ఎం.దినేష్ (రాజపేట).
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

